ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  24 Jan 2024 3:28 PM GMT
ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్‌ ఆడుతుందని, అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారన్నారు. అలాంటి విధానాన్నే మా కుటుంబం మీద కూడా అవలంభిస్తూ ఉందని అన్నారు. నేను కాంగ్రెస్‌ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డికి మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదన్నారు. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి కి ఇచ్చారన్నారు. మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందని అన్నారు.

తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారు సీఎం జగన్. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని జగన్ తెలిపారు.పోలీసులు సాక్ష్యధారాలను కోర్టుకు సమర్పించారని.. అందుకే చంద్రబాబు జైల్లో 52 రోజులు ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు అపోజిషన్ నేత అరెస్ట్ చేయాలని ఎవరు అనుకోరని, చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు బలం లేదని.. టీడీపీ, జనసేన పార్టీలతోనే తమ పోటీ అని క్లారిటీ ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ విషయాల్లో బీజేపీకి మద్దుతు ఇస్తామని తెలిపారు. కొందరు పెద్దలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియం స్కూళ్లగా మారుస్తున్నామని.. కాని నేను ఒక్కటే అడుగుతున్నా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?. వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా?. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అదించడంలో సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు సీఎం జగన్.

Next Story