తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.

By అంజి  Published on  13 Jun 2024 8:40 AM IST
CM Chandrababu, Tirumala Srivaru, TTD, Andhrapradesh

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అటు తరువాత వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.

చంద్రబాబు కుటుంబం గత రాత్రి తిరుమలలోనే బస చేసింది. స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. ఈరోజు సాయంత్రం సచివాలయానికి వెళ్లి తన చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. జూన్ 13 సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన చాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు.

Next Story