తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు మరోసారి కామెంట్లు

తిరుమలలో వీఐపీ సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By M.S.R  Published on  5 Oct 2024 10:46 AM IST
తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు మరోసారి కామెంట్లు

తిరుమలలో వీఐపీ సంస్కృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపడుతామని భక్తులకు హామీ ఇస్తున్నానని తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాల పై పరిమితిని విధిస్తామని, దేశం నలుమూలల నుంచి వచ్చే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ డూప్లికేట్ చేయలేకపోయారని, ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ రుచి రావడం అసాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి ప్రసాదాలు, పరిశుభ్రతలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలన్నారు. తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని, కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని సూచించారు. తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా టీటీడీ అధికారులు, సిబ్బంది పని చేయాలని చెప్పారు. ఏ విషయంలో కూడా రాజీ పడొద్దని అన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళికలు అవసరమని చెప్పారు.

Next Story