పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ

CJI DY Chandrachud Visits Tiruchanur Padmavati. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం తిరుచానూరు

By Medi Samrat  Published on  28 Dec 2022 3:16 PM GMT
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్రచూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో సిజెఐ కి చైర్మన్, ఈవో అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. మూడవ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో శాంతి, విజివో మనోహర్, ఏఎస్పీ కులశేఖర్, డిఎస్పీ మురళీ కృష్ణ, ఆలయ ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.


Next Story