తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదించింది. వెంకయ్య చౌదరి డిప్యుటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. ఆయన గతంలో ఏపీ మినలర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం శాఖల వారీగా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అందుకు తగ్గట్టుగా ఏపీలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మూడు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు.