తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు ప్రజలను, అధికారులను పరుగులు పెట్టించాయి. తిరుపతి కలెక్టరేట్‌తో సహ పలు ఆలయాల్లో బాంబు పెట్టమంటూ బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌తో తనిఖీలకు దిగాయి. కలెక్టరేట్‌తో పాటు ఆలయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించాయి. గత కొద్ది రోజులుగా తిరుపతిని గుర్తు తెలియని దుండగలు టార్గెట్ చేశారు. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ పంపుతున్నారు.
తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధరించారు.