తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు వచ్చింది. నగరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని, అదే తరహాలో తిరుపతి జిల్లాకు కూడా బెదిరింపు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకావద్దు. అనవసరమైన అపోహలను, ఊహాగానాలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
కేవలం తిరుపతిలోనే కాకుండా, తిరుమల, శ్రీకాళహస్తి వంటి ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.