నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజమే.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచలన కామెంట్స్
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By - Medi Samrat |
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మహా ఘోరాతిఘోరం చేశారు.. 94 సంవత్సరాల పాలకమండళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అనైతిక చర్యలకు బీఆర్ నాయుడు పాల్పడ్డారన్నారు. అలాంటి వ్యక్తిని టీటీడీకి ఛైర్మన్‌గా నియమించారు.. ఆయన కామక్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది.. ఆ వీడియోలు చూసి హిందూ భక్తులు మండి పడుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామి పూజలు చేశాకే దినచర్య ప్రారంభిస్తానన్న చంద్రబాబు నియమించిన వ్యక్తి అనైతిక వీడియోలు వచ్చాయి.. ప్రపంచమంతటా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు.
వాత్సాయనుడికి వారసుడుగా బీఆర్ నాయుడు తయారయ్యారన్నారు. ఆయన బీఆర్ నాయుడు కాదు.. కామనాయుడుగా మారాడన్నారు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్నమాట అబద్దం అన్నారు. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు.. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అన్నారు.
తివారీ ఫోటోలు బయటకు వస్తే రాజీనామా చేసి వెళ్లారు.. ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వి గురించి ఆడియో బయటకు రాగానే జగన్ అతనితో రాజీనామా చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు కూడా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలన్నారు.
సిర్రిఅప్పన్ అనే అర్చకుడు అనైతిక కార్యకలాపాలు చేస్తే వధించారు.. ఆ శాశనం తిరుమలలో ఉంది. అలాంటి ఆలయానికి ఛైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
జగన్ కుటుంబ సభ్యులను దూషించినందుకు ఆ స్వామే బీఆర్ నాయుడుకి శిక్ష విధించిందన్నారు. ఆ వ్యక్తిని పదవి నుండి తొలగించకపోగా వైసీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులకు పురిగొల్పటం సిగ్గుచేటు అన్నారు. ఇవేకాదు.. ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తాయి.. డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదన్నారు.
పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు.. ఛైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కామ క్రీడలు చేస్తున్నారా.? అనే అనుమానం కలుగుతోంది.. ఇప్పటికైనా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లడ్డూ కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? బీఆర్ నాయుడు అనైతిక చర్యలను సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదన్నారు. బీఆర్ నాయుడు హిందూధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు.. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.