తిరుమలలోని హనుమాన్ జన్మభూమిలో.. అభివృద్ధి పనులకు భూమిపూజ
Bhoomi Puja held for development works at Hanuman birthplace in Tirumala. తిరుమలలోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుని జన్మస్థలం అని చెబుతున్న స్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం
By అంజి Published on 16 Feb 2022 2:05 PM GMT
తిరుమలలోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుని జన్మస్థలం అని చెబుతున్న స్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదా పీఠం అర్చకులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీతులసీ పీర్ సేవాన్యాలు, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీరామభద్రాచార్య మహరాజ్, అయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద దేవీష్‌గిరిజిగిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదా పీఠం అధ్యక్షురాలు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ.. హనుమంతుని జన్మస్థలమైన తిరుమలలో భూమిపూజ నిర్వహించారు. వేదాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని, తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రుల ఆస్తి అని అన్నారు. హనుమంతుడు అంజనాద్రిలో జన్మించాడని, అనేక మంది వేద, శాస్త్ర పండితులు పరిశోధించి ధృవీకరించారని ఆయన అభిప్రాయపడ్డారు.
అంజనాద్రిలో అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడం సంతోషకరమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోర్టు తీర్పుపై చైర్మన్ స్పందిస్తూ.. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆలయానికి ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినందున ఎలాంటి వివాదాలకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 దేవాలయాలను నిర్మిస్తున్నామన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నామని, ఆ వేంకటేశ్వరుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.