తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటలు, శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటలు పడుతుండగా.. కాలి నడక వచ్చే భక్తుల మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోంది. ఇదిలావుంటే శనివారం శ్రీవారిని 64,752 మంది దర్శించుకున్నారు.