తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
By సుభాష్ Published on 16 Feb 2020 8:29 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 8 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పట్టనుంది. నిన్న స్వామివారిని 81,963 మంది భక్తులు దర్శించుకోగా, 38,452 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 51 లక్షలు వచ్చినట్లు టీటీడీ బోర్డు తెలిపింది.
Next Story