ఆ రెండు జట్లు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Oct 2019 3:58 PM IST

ఆ రెండు జట్లు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి..!

టీ20 వరల్డ్‌కప్‌కు కొత్తగా రెండు జట్లు అర్హత సాధించాయి. కొత్తగా అర్హత సాధించిన ఐర్లాండ్‌, పపువా న్యూగినియా జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్‌ 18 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 15న మెల్‌బోర్న్‌లో టీ20 ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఎలో కెన్యాపై పపువా న్యూగినియా 45 పరుగులతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పీఎన్‌జీ 19.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. అయితే కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్‌ జట్టు కూడా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా టీ20 వర్లడ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌, పీఎన్‌జీ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

Next Story