ఆ వీడియోతో పరువు పోయిందని యువకుడు ఆత్మహత్య..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 8:02 AM GMT
ఆ వీడియోతో పరువు పోయిందని యువకుడు ఆత్మహత్య..!

తూర్పు గోదావరి: టిక్‌టాక్‌ వీడియోతో పరువు పోయిందని మనస్తపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది.

రాజోలు మండలం శివకోటి పోస్టాఫీసు కాలనీకి చెందిన పుచ్చకాయల మోహన్‌ కుమార్‌ ఉపాధి కోసం కువైట్‌ దేశం వెళ్లాడు.

అక్కడ పని చేసుకుంటూ వచ్చిన డబ్బులను ఇంటికి పంపుతూ జీవనం సాగిస్తున్నాడు.రెండు వేల రూపాయల కువైట్‌ డబ్బులు దినర్లు చీటిపాడుకొని కనిపించకుండా పరారీలో ఉన్నాడని తన స్నేహితుడు వడ్డి దుర్గారావు వీడియో క్రియేట్‌ చేశాడు. మోహన్‌ కుమార్‌తో ఫొటోలతో కూడిన ఈ వీడియోని టిక్‌టాక్‌లో పెట్టాడు.

మనస్తాపం చెందిన మోహన్‌ ఈ నెల 3న ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story
Share it