రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన 'ది అండర్టేకర్'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2020 1:23 PM GMTది అండర్టేకర్.. రెజ్లింగ్ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అండర్టేకర్ సోమవారం తన అభిమానులకు చేదువార్త చెప్పాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు(డబ్ల్యూడబ్ల్యూఈ) రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. రెజ్లింగ్‌లో సుధీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన అండర్టేకర్.. ది లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ డాక్యూమెంటరీ చివరి ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అండర్టేకర్‌గా ఖ్యాతి గడించిన ఈ రెజ్లర్ అసలు పేరు మార్క్ కాలవే.
రిటైర్‌మెంట్ సందర్భంగా అండర్టేకర్ మాట్లాడుతూ.. ‘నాకు మరోసారి రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమి లేదు. నేను సాధించేది కూడా ఏమి లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇది కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించిందని పేర్కొన్నారు. అలాగే.. రెజ్లింగ్‌లో తన ప్రయాణం ముగిసిందని.. ఇక మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు అండర్టేకర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా రిటైర్‌మెంట్ విషయాన్ని వెల్లడించాడు.
అండర్టేకర్ రిటైర్‌మెంట్‌పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్ కూడా ట్విటర్‌లో పోస్ట్‌లు చేసింది. ఇదిలావుంటే.. అండర్టేకర్ రిటైర్‌మెంట్‌పై ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు కూడా స్పందించింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ హేవీ వెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టా, ట్విటర్‌లో ఫోస్టు చేస్తూ.. 30 లెజండరీ ఇయర్స్.. థాంక్యూ టేకర్ అని పేర్కొంది.