కొడుకును కడతేర్చిన కన్నతల్లి.. ప్రియుడి కోసమేనా..!

హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. కన్న కొడుకునే ఓ కసాయి తల్లి గొంతు నులిమి చంపింది. వివాహతేర సంబంధానికి అడ్డువస్తున్నాడని పేగు తెంచుకు పుట్టిన కుమారుడు అంజాద్‌ను తల్లి కడతేర్చింది. అంజాద్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కసాయి తల్లి చేసిన పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మైలార్‌ దేవిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్