ఈ కోతులకు 'ఎయిడ్స్' వచ్చింది..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 7:10 AM GMT
ఈ కోతులకు ఎయిడ్స్ వచ్చింది..!!

అవి అత్యంత అరుదైన వానరాలు. నీలగిరి కొండముచ్చులుగా పేరొందిన ఈ వానరాలు ఇప్పటికే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందుకే వన్యప్రాణి విభాగం వీటిని 'రెడ్ లిస్ట్'లో పెట్టాయి. ఒక్క వానరం చనిపోయినా వన్యప్రాణి సంరక్షకులు బాధపడతారు. ఒడిశా లోని నందన్ కానన్ జూ లో ఇలాంటి నీలగిరి వానరాలను సంరక్షిస్తూ ఉంటారు. వాటిని కనురెప్పల్లా కాపాడుకుంటారు.

Nilagiri.2

అలాంటిది ఈ ఏప్రిల్ లో ఫణి సైక్లోన్ ఒడిశా తీరం దాటిన సందర్భంలో కొన్ని వానరాలు చనిపోయాయి. ఏదో తుపాను వల్లనే ఇది జరిగిందని అధికారులు సరిపెట్టుకున్నారు. కానీ ఆ తరువాత ఉన్నట్టుండి వానరాలు అనారోగ్యం పాలు కావడం, కొద్ది రోజుల్లోనే చనిపోవడం మొదలైంది. మందులు మాకులు పనిచేయడం లేదు. దీంతో ఇదేదో వైరస్ దాడిగా భావించి, జూ అధికారులు చనిపోయిన వానరాల రక్తం, తదితర సాంపిల్స్ పుణె ఎన్ ఐ వీ పరిశోధనశాలకు పంపించారు. అక్కడ విస్తృత పరిశోధనలు జరిపితే అసలు సంగతి బయటపడింది. ఈ వానరాలకు మేసన్ ఫైజన్ మంకీ వైరస్ అనే కొత్త వైరస్ సోకిందని, ఈ వైరస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని హరించివేస్తుందని, చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా వానరం కోలుకోలేదని, చివరికి ఆ జంతువు అర్థాంతరంగా చనిపోతుందని తెలిసింది.

Nilagiri1

కోతులకేమో అయితే మనకెందుకు అనుకుంటున్నారా? అయ్యా ... ఆగండాగండి..... మనిషి పుట్టింది కోతుల నుంచేనండీ. అంతే కాదు. ఈ మేసన్ ఫైజర్ మంకీ వైరస్ లక్షణాలు మనుషులకు సోకే ఎయిడ్స్ లక్షణాలను పోలి ఉంటాయి. ఈ కోతుల్లో ఉన్న క్రోమో బాక్టీరియమ్ వయోలేసియమ్ అనే బాక్టీరియా నుంచే ఈ వైరస్ వస్తోందని కనుగొన్నారు. ఈ వైరస్ జీనోమ్ సీక్వెన్స్ ను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నాచురల్ రిసోర్సెస్ సంస్థ రెడ్ లిస్టు లో ఉన్న ఈ నీలగిరి కొండముచ్చు ను కాపాడటంలో ఈ పరిశోధనలు ఎంతో పనికివస్తాయి. మన దేశంలోని పడమటి కనుమల్లో మాత్రమే కనిపించే ఈ అత్యంత అరుదైన వానరాలను కాపాడటం మన బాధ్యత. అంతే కాదు. వీటికి వచ్చిన ముప్పును పరిష్కరించడం ద్వారా మానవులకు సోకే ఎయిడ్స్ ను అర్థం చేసుకోవడానికి కూడా సులువులు తెలుస్తాయి. ఈ పరిశోధనల తరువాత ఈ జాతి వానరాల నియమబద్ధమైన స్క్రీనింగ్, వ్యాధి నిరోధక ట్రీట్మెంట్లు, రోగనివారణ పద్ధతులను పాటించడం వంటి చర్యలను చేపట్టడానికి వీలుంటుంది.

Next Story