ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలి : పవన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 10:19 AM GMT
ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలి : పవన్‌

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చి కూడా రాష్ట్రం ఓ కొలిక్కి రాకుండా పోయిందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని పవన్‌ అన్నారు. కేసీఆర్‌ 48 వేల మంది కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఆర్టీసీ కార్మికుల సమస్యపై విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్‌ అడుగుతాను. కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకుంటే అప్పుడు ఆలోచిస్తానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలు చేయాలని కేటీఆర్‌ను, హారీష్‌రావును అడుగుతానన్నారు. ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలి. కేసీఆర్‌ ఎందుకు కోపంగా ఉన్నారో తెలియరావడం లేదన్నారు. భవిష్యత్తు కార్మికుల నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన మొదటి నుంచి సమ్మెకు మద్దతు ప్రకటించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా కేసీఆర్‌ గుర్తిస్తారని తెలిపారు.

Next Story