హైదరాబాద్‌: మనిషికి విలువ ఇవ్వలేని సమాజంలో మనిషి ప్రాణానికి కూడా విలువ లేకుండా పొతోంది. ఎవరై తప్పుచేసావని చెప్పినా, కాస్త మందలించినా వారిపై కక్ష కట్టి మరీ ప్రతీకారాన్ని తీర్చుకునే మనస్తత్వాలని అలవర్చుకుంటున్నారు నేటి సమాజంలోని మనషులు. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తే పడిపోకుండా పట్టుకున్న చేతులు పెద్దైయ్యాక తప్పుచేస్తున్నావని ప్రశ్నించిన పాపానికి కన్నవారా, లేక బంధువులా, స్నేహితులా అని కూడా చూడకుండా ప్రశ్నించిన వారిని నిర్ధాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రతగల సమాజంలో జీవిస్తున్నట్లుగా అనిపించడం లేదు. నల్లతోలు కప్పుకున్న తోడేళ్ల మధ్య నడక సాగిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

 

ఇకపోతే పిల్లలను కని పెంచి పెద్దచేసి అభివృద్ధిలోకి తెచ్చేది వారి చేతిలో చావడానికే అన్నట్లుగా ఇప్పటి మనుషులు తయారు అవుతున్నారు.నువ్వు తప్పు చేస్తున్నావు అని కన్న తల్లిదండ్రులు మందలిస్తే వారిని చంపడమేనా మనం ఇన్నాళ్లుగా నేర్చుకున్నది. ఇది ఎంత అమానుష చర్య. ఇలాంటి పాపాన్నే ఓ కూతురు చేసింది. ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది.

వివరాల్లోకి వెళ్లితే… రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి ఇక్కడే డ్యూటి చేసుకుని ఇంటికి వెళ్ళుతున్నాడు. ఇక అతని కూతురు కీర్తి. ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లి రజిత (38) కీర్తిని మందలించడంతో భరించలేకపోయిన కీర్తి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. అంతేకాకుండా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఆ ఇంట్లోనే తల్లి శవం పక్కనే గడిపింది. అప్పటికే మూడు రోజులు కావడంతో ఆ మరణించిన దేహాం దుర్వాసన రావడంతో ప్రియుడి సహాయంతో రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది.

అంతేకాకుండా తాను వైజాగ్ టూర్‌కు వెళ్లుతున్నానని తండ్రికి ఫోన్లో చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో గడిపింది. లారీ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లిన తండ్రి శ్రీనావాస్ రెడ్డి డ్యూటీ ముగించుకుని ఇంటికి రాగా అతని భార్య కనిపించకపోవడంతో కూతుర్ని పలువిధాలుగా గట్టిగా నిలదీసాడు. అప్పటికి గాని అసలు విషయం వెలుగులోకి రాలేదు.. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను చంపినట్లు నేరస్థురాలైన కీర్తి అంగీకరించింది.

Letter

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.