దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి అనేక మంది ఆస్పత్రుల బాట పడుతున్నారు. వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ప్రజలెవరూ బయటకు రాకుండా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయిన పలు ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో అత్యధిక కరోనా పాజటివ్‌ కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను కేంద్రం హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలు కూడా ఉన్నాయి. తాజాగా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో హాట్‌స్పాట్‌లలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో, వైరస్‌ నియంత్రణ లక్ష్యంగా లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్‌

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 15 జిల్లాలను పూర్తిగా దిగ్బంధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ 15 జిల్లాల్లో లక్నోతో పాటు ఘజియాబాద్‌, నోయిడా, ఆగ్రా, షాల్మీ, కాన్పూర్‌, వారణాసి, బరేలీ, సీతాపూర్‌, బులంద్‌షహర్‌, మీరల్‌, మహరాజ్‌గంజ్‌, ఫిరోజాబాద్‌, బస్తీ, షహారన్‌పూర్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారి ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Also Read : మద్యం కోసం నాలాలోకి దూకిన వ్యక్తి.. బయటకు రప్పించేందుకు తంటాలు పడ్డ పోలీసులు

ఇదిలా ఉంటే యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని సేవలందిస్తున్న పోలీస్‌ సిబ్బందికి రూ. 50లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్‌ అవస్థి బుధవారం ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సీఎం యోగి కార్యాలయం త్వరలోనే విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్