భారత్ లోకి చొరబడ్డ ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 5:54 AM GMT
భారత్ లోకి చొరబడ్డ ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశంలో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఆగస్ట్ 7 నుంచి 75 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు గూఢచార వర్గాలు గుర్తించాయి. వీరి కదలిలకపై అధికారులు నిఘా వేశారు. భారత్‌లో పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఆల్ ఖైదా, ఐసిస్‌ ప్రణాళికలు రచించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సరిహద్దుదాటిన ఉగ్రవాదులు పలు రాష్ట్రాలకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..ఈ ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడున్నారనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. కొంత మంది ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలకు తరలివెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలు అలర్ట్ చేశాయి. తమిళనాడులో కొన్ని రోజులుగా సోదాలు చేస్తున్నారు. అలానే కేరళలో కూడా అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టారు. లక్ష్య దీవులు కూడా నిఘా వర్గాల కనుసన్నల్లోనే ఉన్నాయి.

terrorists-enter-into-india

Next Story