టీవీ ఛానెల్‌ వాహనాన్ని పేల్చివేసిన ఉగ్రవాదులు.. ముగ్గురు మృతి

By సుభాష్  Published on  31 May 2020 8:35 AM GMT
టీవీ ఛానెల్‌ వాహనాన్ని పేల్చివేసిన ఉగ్రవాదులు.. ముగ్గురు మృతి

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే ఉగ్రవాదులు మాత్రం ఒక్కడో ఓ చోటు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. ఉగ్రమూకలు సామాన్యులను సైతం వదలిపెట్టడం లేదు. ఇక తాజాగా ఓ టీవీ ఛానెల్‌ను టార్గెట్‌ చేశారు. ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన కుర్షీద్‌ టీవీ ఛానెల్‌ వాహనంపై దాడికి దిగాడు. ఛానెల్‌కు సంబంధించిన వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.

ఈ ఘటనలో ఛానెల్‌కు సంబంధించిన జర్నలిస్ట్‌, వాహన డ్రైవర్‌, మరో వ్యక్తి సహ ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుర్షీద్‌ టీవీ ఛానెల్‌ ఛీఫ్ ఎడిటర్‌ సిద్దిఖీ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఆప్ఘన్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ ఏ ఉగ్ర సంస్థ కూడా తాము దాడి చేసినట్లు ప్రకటించలేదు.

కాగా, ఉగ్రవాదులు ఇతర దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా రెచ్చిపోతున్నారు. ఇటీవల పుల్వామా తరహాలో మరో దాడి చేసినందుకు ప్రయత్నించగా, ఇంటలిజెన్స్‌ సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిని భారతదేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ ఘటన తర్వాత తీవ్ర వాదులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా భారత సెక్యూరిటీ ఫోర్స్ పుల్వామా అటాక్ లాంటి మరో ఉగ్రదాడిని ఆపగలిగారు. పుల్వామా జిల్లాలో 20 కేజీల ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైస్(ఐఈడి)లతో వెళుతున్న కారును అధికారులు పట్టుకున్నారు.

పేలుడు పదార్థాలను తీసుకుని వెళుతున్న కారు తప్పుడు రిజిస్ట్రేషన్ తో ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసుల బ్యారికేడ్ ను చూసి వేగంగా వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ వీలు పడలేదు. కారు వేగంగా వస్తున్నదాన్ని చూసి సెక్యూరిటీ అధికారులు కారుపై కాల్పులను జరిపారు. వెంటనే కారును అక్కడే నిలిపేసిన డ్రైవర్ పారిపోయాడు. తీరా కారులో చూడగా.. 20 కేజీల పేలుడు పదార్థాలు కనిపించాయి. పేలుడు పదార్థాలను కారు నుండి బయటకు తీసి.. బాంబ్ స్క్వాడ్ పేల్చివేసింది.

Next Story