మానవత్వం చాటిన జవాన్లు.. ప్రశంసిస్తున్న ప్రజలు

By సుభాష్  Published on  29 May 2020 3:21 PM GMT
మానవత్వం చాటిన జవాన్లు.. ప్రశంసిస్తున్న ప్రజలు

వారిద్దరు బద్ద శతృవులు.. వారిద్దరు కూడా ఎదురు పడ్డారంటే ఇంక అంతే సంగతి. కాల్పుల మోత మోగాల్సిందే.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఒకరిపై ఒకరు తుపాకి గుండ్ల వర్షం కురిపించాల్సిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతా శత్రుత్వం. వారిద్దరికి కూడా ఒకరి కలలో ఒకరు వచ్చినా రగిలిపోయేంత శత్రుత్వం. వారే పోలీసులు.. మావోయిస్టులు. మావోయిస్టుల కోసం అనుక్షణం పోలీసులు అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటారు. వారి కోసం ప్రతీ రోజు జరిగే సంఘటనలు ఇవి. అలాంటి శత్రుత్వం ఉన్నవారి మధ్య ఎవరు ఊహించని సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్టులకు రక్తదానం చేశారు. అయితే శుక్రవారం సీఆర్పీఎఫ్ జవాన్లుకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. మరి మావోయిస్టులను అరెస్టు చేస్తే వారికి రక్తదానం ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.

వారు అరెస్టు అయిన మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జవాన్లు టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రక్తం కావాలని వైద్యులు సూచించారు. దీంతో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఓంప్రకాశ్ యాదవ్‌, సందీప్‌ కుమార్‌లు వారికి రక్తదానం చేశారు. మానవత్వంతోనే ఈ రక్తదానం చేశామని, మనిషిగా ఒక బాధ్యతగా రక్తం దానం చేశామన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉన్న శత్రువులకు సైతం రక్తదానం చేయడంపై పలువురు జవాన్లను ప్రశంసించారు.

Next Story