నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాత‌వ‌ర‌ణం ఏర్ప‌డింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అడ్వకేట్లు కోర్టు ప్రాంగణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయ‌బోగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ పరిస్థితి ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారింది. కార్య‌క్ర‌మంలో భాగంగా న్యాయవాదులు నాంపల్లి కోర్టు నుండి బస్ భవన్ వరకు బైక్ ర్యాలీ చేప‌ట్టారు. కోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించ‌డంతో భ‌యాన‌క వాత‌వ‌ర‌ణం ఏర్ప‌డింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.