నాంపల్లి కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
By - Medi Samrat | Published on : 18 Oct 2019 1:17 PM IST

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అడ్వకేట్లు కోర్టు ప్రాంగణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయబోగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు నాంపల్లి కోర్టు నుండి బస్ భవన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో భయానక వాతవరణం ఏర్పడింది.
Next Story