షర్మిల‌ ఐర‌న్ లేడి.. త‌ప్ప‌క ముఖ్య‌మంత్రి అవుతుంది

YSRTP President YS Sharmila Meets D Srinivas. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ను సోమ‌వారం వైఎస్సార్టీపీ అధినేత్రి

By Medi Samrat  Published on  25 July 2022 10:42 AM GMT
షర్మిల‌ ఐర‌న్ లేడి.. త‌ప్ప‌క ముఖ్య‌మంత్రి అవుతుంది

మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ ను సోమ‌వారం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె డీఎస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఆసక్తి కరమైన చర్చ చోటుచేసుకుంది. వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను డీఎస్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని డీఎస్ చెప్పారు. సరైన టైం లో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందని అన్నారు.

డీఎస్.. షర్మిల‌ను ఐర‌న్ లేడిగా అభివ‌ర్ణించారు. నా రాజకీయ అనుభవం తో చెప్తున్న.. షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని నొక్కి చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అవుతారు అని.. తాను 2003 లోనే చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. భవిష్యత్ లో వైఎస్సార్ బిడ్డ ష‌ర్మిల‌ తప్పక ముఖ్యమంత్రి అవుతుందని డీఎస్ అన్నారు.
Next Story
Share it