బ్రేకింగ్.. వైఎస్ షర్మిల అరెస్ట్

YSRTP President YS Sharmila Arrest. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat
Published on : 28 Nov 2022 4:32 PM IST

బ్రేకింగ్.. వైఎస్ షర్మిల అరెస్ట్

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. షర్మిల ప్రచారం రథానికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. తమపై దాడులకు పాల్పడిన వారిని వదిలేసిన తమను అరెస్ట్ చేయడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైయస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లా లింగగిరి గ్రామంలో పాదయాత్ర చేస్తుండగా.. ఆమె రెస్ట్ తీసుకునే బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. బస్సు తగలబెట్టే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా షర్మిల పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షర్మిల బస చేసే ఏసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించి బస్సులో ఉన్న సిబ్బంది మంటలను గమనించి ఆర్పి వేశారు. షర్మిల పాదయాత్రలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది.


Next Story