ట్విట్టర్ లో వైఎస్ షర్మిల వర్సెస్ ఎమ్మెల్సీ కవిత
YS Sharmila vs Kalvakuntla Kavitha. వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 30 Nov 2022 8:15 PM ISTవైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. బీజేపీ కోసం షర్మిల తెలంగాణలో పాదయాత్రలు చేస్తోందని కవిత విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ లో కామెంట్ల యుద్ధం జరుగుతోంది. 'తాము వదిలిన "బాణం"... తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు"' అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల స్పందించారు. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో 'కవిత'లకు కొదవ లేదు' అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత కూడా స్పందించారు. 'అమ్మా.. కమల బాణం... ఇది మా తెలంగాణం... పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం... మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు... నేడు తెలంగాణ రూటు... మీరు కమలం కోవర్టు... ఆరేంజ్ ప్యారేట్టు... మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను... రాజ్యం వచ్చాకే రాలేదు నేను... ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !' అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.
అమ్మా.. కమల బాణం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణం
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టు
మీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి " కవిత" ను నేను ! https://t.co/rkGthDtHF9
తాము వదిలిన "బాణం"
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు"