వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

YS Sharmila visiting Venkatesh's family. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు.

By Medi Samrat  Published on  2 Jun 2021 4:34 PM IST
వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకూ నోటిఫికేషన్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. డీఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ ఆత్మహత్య మే16న ఆత్యహత్య చేసుకున్నాడు. వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం వెఎస్‌ షర్మిలా మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా.. ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం యువ‌కులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.


Next Story