కేసీఆర్ ఇలాకా గ‌జ్వేల్‌లో రేపు వైఎస్‌ షర్మిళ దీక్ష

YS Sharmila to takeup Deeksha in Gajwel. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ

By Medi Samrat
Published on : 30 Aug 2021 5:59 PM IST

కేసీఆర్ ఇలాకా గ‌జ్వేల్‌లో రేపు వైఎస్‌ షర్మిళ దీక్ష

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో ఆమె దీక్షను చేపట్టనున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆమె దీక్షను చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో ఉద్యోగం రాలేదనే బాధతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబాన్ని షర్మిల రేపు ఉదయం పరామర్శించనున్నారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగదీక్షలో పాల్గొంటారు.



Next Story