మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు

YS Sharmila Slams CM KCR. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతుంది.

By Medi Samrat  Published on  26 Sep 2022 9:31 AM GMT
మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతుంది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని హనుమాన్ నగర్ లో వైఎస్ షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామ‌స్తులతో ముచ్చ‌టించిన ష‌ర్మిల అనంతరం మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓటేస్తే ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు.. ఇక మళ్ళీ మళ్ళీ మోసపోవద్దని ప్ర‌జ‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ అన్ని మోసం చేసే పార్టీలేన‌ని.. ఏ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి కోట్లాడే పార్టీ కాదని విమ‌ర్శించారు.

మీ ఓటుతో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ది చెప్పాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. తెలంగాణ‌లో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని.. ఇళ్లులు కట్టాలి అన్నా..పెన్షన్లు ఇవ్వాలి అన్నా.. వైఎస్సార్ పాలన రావాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలి.. అరోగ్య శ్రీ బ్రహ్మాండంగా అమలు కావాలి.. తెలంగాణ లో వ్యవసాయం పండుగ కావాలి.. అంటే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తోనే సంక్షేమ పాలన సాధ్యం. నేను వైఎస్సార్ బిడ్డను.. మాట మీద నిలబడే పార్టీ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని చెప్పుకొచ్చారు.


Next Story
Share it