అధికారం ఉన్నప్పుడే ఫాంహౌస్‌ చక్కబెట్టుకుంటున్నారు : పార్టీ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

YS Sharmila Slams CM KCR. వైస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన

By Medi Samrat  Published on  8 July 2021 2:21 PM GMT
అధికారం ఉన్నప్పుడే ఫాంహౌస్‌ చక్కబెట్టుకుంటున్నారు : పార్టీ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు
వైస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె ప్రసంగిస్తూ.. తన పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని వెల్లడించారు. అవి సంక్షేమం, స్వయంసమృద్ధి, సమానత్వం అని వివరించారు. వైఎస్‌ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు.


మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో ఇంకా పేదరికం పోలేదని.. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్‌ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నాయ‌ని ష‌ర్మిల అన్నారు. సీఎం కేసీఆర్‌.. అధికారం ఉన్నప్పుడే ఫామ్‌హౌస్‌ చక్కబెట్టుకుంటున్నారని.. కేసీఆర్‌ కుటుంబం దోచుకుని దాచుకుంటోందని.. పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్‌ ఫ్యామిలీనే అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా ఉండేదని.. కరోనాకు ఎంతో మంది బలైపోయారు.. ఆస్తులమ్ముకున్నారని అన్నారు. సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. ఆస్తులమ్ముకున్న కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని.. తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్‌ పాపం పోతుందా? అని ప్ర‌శ్నించారు.

వైఎస్‌ సంక్షేమం అంటే భరోసా, రక్షణ, భద్రత. వైఎస్‌ సంక్షేమం అంటే కరోనాలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా అప్పులపాలు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందడం.. వైఎస్‌ బతికి ఉంటే అదే చేసేవారని షర్మిల తెలిపారు. కేసీఆర్‌ సంక్షేమం అంటే.. పథకాలు ప్రకటించి దిక్కులు చూడాలి. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి.. ఆరోగ్యాన్ని గాలికి వదిలేయాలి. రైతుభరోసా ఇచ్చి.. ఆ డబ్బును వడ్డీ కింద జమకట్టుకోవ‌డం.. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఏళ్లు గడిచినా వాయిదా వేసుకోవడం. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చనిపోయినవారు రైతులు కాదని చెప్పడం. గారడీ మాటలు, చేతికి చిప్పలు ఇవే కేసీఆర్ సంక్షేమ‌మ‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story