సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు

YS Sharmila Slams CM KCR. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల నిరుద్యోగుల

By Medi Samrat  Published on  23 Jun 2021 9:17 AM GMT
సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల నిరుద్యోగుల ప‌క్షాన నిల‌బ‌డ్డ ష‌ర్మిల‌.. తాజాగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల విష‌య‌మై స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. ఇందుకు సంబంధించి ఓ వార్తాప‌త్రిక‌ 'ఇండ్లియ్య‌రాయె' అనే హెడ్ లైన్‌తో ప్ర‌చురించిన‌ క‌థ‌నాన్ని వైఎస్ ష‌ర్మిల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

మూడు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడుతమని.. చెప్పి 6 ఏండ్లయినా లక్ష కూడా కట్టలే, ఇచ్చినవి వేలల్లో కూడా లేవు, ఒకవైపు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలిపోతున్న.. లబ్ధిదారులు ఆందోళన చేస్తున్న.. పేదలకు ఇండ్లు ఇచ్చింది లేదు, ఆత్మగౌరవ ఇండ్లు పేదలకు అందాలంటే ఎన్నికలు రావాలా.. కేసీఆర్ దొరా అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇదిలావుంటే.. ష‌ర్మిల షేర్ చేసిన క‌థ‌నంలో.. సూర్యాపేట జిల్లా మున‌గాల‌లో ఇళ్లు పూర్తయ్యి ఏడాది, రెండేళ్లు గడుస్తున్నా కేటాయించక‌పోవ‌డంతో దెబ్బతింటున్నాయని వివరించారు. అలాగే, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని.. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌పై సర్కారు తీవ్ర జాప్యం చేస్తోందని పేర్కొన్నారు.Next Story
Share it