ఇకనైనా కళ్లు తెరవండి దొరా.. దూకుడు పెంచిన ష‌ర్మిల‌

YS Sharmila Slams CM KCR. తెలంగాణలో నూత‌న రాజ‌కీయ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన‌ వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై

By Medi Samrat  Published on  12 Jun 2021 3:28 PM IST
ఇకనైనా కళ్లు తెరవండి దొరా.. దూకుడు పెంచిన ష‌ర్మిల‌

తెలంగాణలో నూత‌న రాజ‌కీయ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన‌ వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ.. ట్వీట్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక అన్నదాత తీవ్రమైన గోస ప‌డుతున్నాడని.. నేనూ రైతునే అని చెప్పుకునే కేసీఆర్ కు రాష్ట్రంలోని రైతుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష?.. రాష్ట్ర‌ వ్యాప్తంగా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరవాలని సీఎంపై సీరియ‌స్ అయ్యారు ష‌ర్మిల‌. ట్వీట్‌తో పాటు రైతులను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

ఇదిలావుంటే.. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ( వైఎస్సార్ టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ వైఎస్సార్ టీపీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక కొత్త పార్టీకి సంబంధించి ఆడ్ హాక్ అధికార ప్రతినిధులను నియమించినట్లు వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది. వీరిలో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ లు ఉన్నారు.


Next Story