పోలీసులు నాపై దురుసుగా ప్రవర్తించారు : వైఎస్ ష‌ర్మిల‌

YS Sharmila Says police misbehaved with me. వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం

By Medi Samrat  Published on  24 April 2023 10:51 AM GMT
పోలీసులు నాపై దురుసుగా ప్రవర్తించారు : వైఎస్ ష‌ర్మిల‌

వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అరెస్ట్ అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. తాను సిట్‌ కార్యాలయానికి వెళ్ళాలి అనుకున్నట్లు ష‌ర్మిల తెలిపారు. సిట్‌ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మా అనుమానాలను అధికారికి చెప్పడం మా భాధ్యత అని వెల్ల‌డించారు. సిట్‌ ఆఫీస్ కు వెళ్ళడానికి తాను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని.. నేను ధర్నాకు పోలేదు, ముట్టడి అని పిలుపు నివ్వలేదని అన్నారు. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? అని ప్ర‌శ్నించారు.

నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. పోలీసులు నాపై దురుసుగా ప్రవర్తించార‌ని అన్నారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారని అన్నారు.. నా మీద పడితే నేను భరించాలా..? అంటూ ఫైర్ అయ్యారు. నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత అని వెల్ల‌డించారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..? ప్ర‌శ్నించారు.





Next Story