మునుగోడు ఉప ఎన్నికపై జోస్యం చెప్పిన వైఎస్ షర్మిల

YS Sharmila predicted Munugode by-election. మునుగోడు ఉప ఎన్నికలపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 22 Oct 2022 3:16 PM IST

మునుగోడు ఉప ఎన్నికపై జోస్యం చెప్పిన వైఎస్ షర్మిల

మునుగోడు ఉప ఎన్నికలపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని షర్మిల జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి సోదరులపై ఆమె విమర్శలు గుప్పిస్తూ.. వారిద్దరూ కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అని అన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికలో వైయస్సార్టీపీ ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా... మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగడం లేదని ఆమె అన్నారు. ఈ ఎన్నిక అధికార పార్టీకి, ఒక రాజకీయవేత్త అహంకారానికి మధ్య జరుగుతోందని చెప్పారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Next Story