తెలంగాణలో వైఎస్ షర్మిల నూతనంగా ప్రారంభించనున్న పార్టీ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నిక సంఘానికి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ఈ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. ఇక కొత్త పార్టీకి సంబంధించి ఆడ్ హాక్ అధికార ప్రతినిధులను నియమించినట్లు వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది. వీరిలో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్టాబ్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమి రెడ్డి, బీశ్వ రవీందర్ లు ఉన్నారు.