వైఎస్ షర్మిల పార్టీ జెండా అదేనా..?

YS Sharmila Party Flag Colour. దివంగ‌త నేత‌, మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి త‌న‌య‌ ష‌ర్మిల తెలంగాణ‌లో స్థాపించ‌బోయే నూత‌న

By Medi Samrat  Published on  5 July 2021 1:10 PM GMT
వైఎస్ షర్మిల పార్టీ జెండా అదేనా..?

దివంగ‌త నేత‌, మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి త‌న‌య‌ ష‌ర్మిల తెలంగాణ‌లో స్థాపించ‌బోయే నూత‌న పార్టీ వైఎస్సార్టీపీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని జోరుగా ప్ర‌చారం సాగుతుంది. ఈ మేర‌కు పాలపిట్ట రంగు 80 శాతం, నీలం రంగు 20శాతం ఉండేలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఈ మేర‌కు ఓ జెండా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇది నిజ‌మో.. కాదో తెలియ‌ని అయోమ‌యంలో రాజ‌కీయ వ‌ర్గాలున్నాయి.


అయితే.. తెలంగాణలో షర్మిల టార్గెట్-2023 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఇప్పటికే రాజకీయంగా ఓ వ్యూహకర్తను సిద్దం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు.. ఏపీలో అన్న జగన్ ఏ రకంగా వ్యూహాలు.. ప్రణాళికలు.. ప్రచారం.. పాదయాత్ర నిర్వహించారో.. పూర్తిగా అదే మార్గంలో షర్మిల కూడా ప్రయాణం చేయటానికి సిద్దమయ్యారు. ఇక తన భవిష్యత్ ప్రణాళికలను ఈ నెల 8వ తేదీన షర్మిల వెల్లడించనున్నారు.


Next Story
Share it