పాదయాత్ర ను టార్గెట్ చేశారు : వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra Update. హైకోర్ట్ పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.

By Medi Samrat  Published on  11 Dec 2022 4:00 PM GMT
పాదయాత్ర ను టార్గెట్ చేశారు : వైఎస్ షర్మిల

హైకోర్ట్ పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కేసీఅర్ పోలీస్ భుజాన తుపాకీ పెట్టి పాదయాత్ర ను టార్గెట్ చేశారని.. కోర్ట్ ఆదేశాలకు కూడా గౌరవం లేదని విమ‌ర్శించారు. ఆమరణ దీక్ష చేస్తుంటే నన్న, మా కార్యకర్తలను బందీలను చేశారు.. ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేశారు. లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికెడ్స్ పెట్టారు.. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.. అకారణంగా కర్ఫ్యూ విధించారని మండిప‌డ్డారు.

మా కార్యకర్తలను మెడ పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ లో పెట్టి దారుణంగా కొట్టారు. ఇవ్వన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారని అన్నారు. YSR బిడ్డ ఒకటే చెప్తుంది.. మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదు.. పేరు పేరునా మనస్పూర్తిగా కృతఙ్ఞతలు.. పోలీస్ లు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరించారు.. YSR పై మీకున్న అభిమానాన్ని మరొక్క సారి నిరూపించుకున్నారు.. YSR బిడ్డను కేసీఅర్ పంజరంలో పెట్టి బందించ వచ్చు అనుకుంటున్నారు. అది కేసీఅర్ తరం కాదు.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని అన్నారు.


Next Story