మంద కృష్ణ మాదిగను కలిసిన షర్మిల..

YS Sharmila Meet With Manda Krishna Madiga. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ఈ రోజు విద్యానగర్ లోని

By Medi Samrat  Published on  8 Sep 2021 8:30 AM GMT
మంద కృష్ణ మాదిగను కలిసిన షర్మిల..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ఈ రోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్వ‌హించ‌బోయే "ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ‌కు ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ళితుల ప‌క్షాన మా యొక్క‌ పోరాటానికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మంద‌కృష్ణ మాదిగని ష‌ర్మిల‌ కోరారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. ష‌ర్మిల వెంట మంద కృష్ణ‌ను క‌లిసిన వారిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేత ఏపూరి సోమ‌న్న కూడా ఉన్నారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల‌ బాత్‌‌రూంలో కాలు జారి పడ‌డంతో మంద కృష్ణ‌కు.. బోన్‌‌ ఫ్రాక్చర్ అయ్యింది. చికిత్స తీసుకున్న అనంత‌రం రెస్ట్ తీసుకుంటున్నారు. మంద కృష్ణ‌ను ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కూడా క‌లిసి ప‌రామ‌ర్శించారు. త్వ‌ర‌గా కోలుకుని ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని అభిల‌షించారు.


Next Story
Share it