టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన‌ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌ త్వరలో బీజేపీలో చేరనున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్న వైఎస్ ష‌ర్మిల ఈటెల పార్టీ మార్పుపై కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధవారం పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో వైఎస్‌ ష‌ర్మిల సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ లేదని.. ఈటల వస్తానంటే తాము ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. ఇక పార్టీ గుర్తు టేబుల్ ఫ్యాన్ అంటూ జ‌రుగుతున్న‌ ప్రచారాన్ని ష‌ర్మిల‌ ఖండించారు. అంతా ఫూలిష్ ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు.


సామ్రాట్

Next Story