తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి వైఎస్ షర్మిల ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యలను తీర్చడానికి తనవంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం ఉద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్సార్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల నేడు చెప్పినట్లుగానే నిరాహారదీక్షకు దిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో 'నిరుద్యోగ నిరాహార దీక్ష' చేపట్టారు.
ఈ ఉదయం వనపర్తి జిల్లాకు చేరుకున్న షర్మిల నిరుద్యోగి కొండల్ ఫ్యామిలీని పరామర్శించి తాడిపత్రిలో నిరుద్యోగ నిరహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తాడిపత్రి గ్రామానికి చెందిన కొండల్ అనే బి.ఎడ్ గ్రాడ్యుయేట్ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో మంగళవారం దీక్షకు హాజరై మద్దతు పలకాలని షర్మిల పార్టీ అడహాక్ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో నిరుద్యోగులకు మద్దతుగా వైస్ షర్మిల పోరాటం చేస్తున్నారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేడు వనపర్తి నియోజక వర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగబోతున్నది.