దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ : షర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు

YS Sharmila Fires On CM KCR. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నాని వైఎస్‌ఆర్‌టీపీ

By Medi Samrat  Published on  20 Oct 2021 11:13 AM GMT
దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ : షర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నాని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని.. ఇదే చేవెళ్ల గడ్డ నుంచి 18 ఏళ్ల క్రితం తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. ప్రతి పల్లెకు వస్తానని.. వారితో మమేకం అవుతానని ప్రకటించారు షర్మిల. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని.. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని హెచ్చరించారు. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానని ప్రకటించారు. దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని షర్మిల దుయ్యబట్టారు. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు రావు. నిరుద్యోగులు హమాలీలుగా మారారు. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారని విమర్శించారు షర్మిల.

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలతో బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగమని.. వైఎస్సార్ ఆశయాలను షర్మిల నెరవేరుస్తారని తెలిపారు. షర్మిల పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదం కావాలని విజయమ్మ కోరారు. షర్మిల ఏది పట్టుకున్నా సాధించే వరకు వదలదని.. చేవెళ్ల ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్ పాదయాత్ర ఉమ్మడి ఏపీ చరిత్రనే మార్చి వేసిందని, పాదయాత్రతో రాష్ట్రాన్ని వైఎస్సార్ అవగాహన చేసుకున్నారని చెప్పారు.



Next Story