సీఎం సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయి

YS Sharmila Fires On CM KCR. తెలంగాణలో కొత్త పార్టీకి పెట్ట‌డానికి సిద్ధ‌మైన‌ వైయస్ షర్మిల ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

By Medi Samrat  Published on  18 May 2021 2:36 PM IST
YSR Sharmila

తెలంగాణలో కొత్త పార్టీ పెట్ట‌డానికి సిద్ధ‌మైన‌ వైయస్ షర్మిల ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వ్యూహాత్మ‌కంగా స్పందిస్తూ ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామ‌కంపై ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో ప‌ర్మినెంట్ ఉద్యోగాల నియామ‌కం ప‌క్క‌కుపెట్టిన‌.. సీఎం కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. 2017లో 3,311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు.. అర్హత సాధించిన 658 మందికి మాత్రం ఇంకా ఉద్యోగాలు కల్పించలేదని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ ప‌త్రిక‌లో వచ్చిన వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ష‌ర్మిల ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.



Next Story