లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు : వైఎస్ షర్మిల

YS Sharmila Fire On TRS. పాదయాత్రను అడ్డుకోవడానికి కేసీఅర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తూనే ఉన్నార‌ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

By Medi Samrat  Published on  14 Dec 2022 11:39 AM GMT
లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు : వైఎస్ షర్మిల

పాదయాత్రను అడ్డుకోవడానికి కేసీఅర్ అడుగడుగునా ప్రయత్నం చేస్తూనే ఉన్నార‌ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 3500 కిలోమీట‌ర్లు ఏ ఆటంకం లేకుండా పాద‌యాత్ర‌ చేశానని.. కేసీఅర్ గూండాలు నా బస్సును, వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టి, మా వాళ్ళను కొట్టి నానా హంగామా చేశారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు అని విమ‌ర్శించారు. బాధితురాలు అయిన నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకువచ్చారని అన్నారు.

నేను ఆమరణ దీక్ష చేస్తే కర్ఫ్యూ పెట్టించారు. మతకల్లోలాలు జరిగితే విధించే కర్ఫ్యూ ను నా ఇంటి చుట్టూ పెట్టారని.. అడుగడునా పోలీస్ లను పనోళ్ళ లా వాడుకుంటూ నన్ను దిగ్బందించార‌ని అన్నారు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అందుకే మమ్మల్ని కొడుతున్నారు. పోలీసుల తప్పు కాదు.. అనుకుంటే వీరి ప్రవర్తన శ్రుతి మించుతుంద‌ని విమ‌ర్శించారు. పోలీస్ ల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. పోలీస్ శాఖ కు ఉన్న మర్యాద మొత్తం తీసేశారని.. ఇక మాకు తప్పడం లేదు..అందుకే పోలీస్ శాఖ మీద కోర్ట్ లో ఫిర్యాదు చేస్తున్నామ‌న్నారు.

నన్ను ఎందుకు కట్టడి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నా రైట్స్ భంగం కలిగిస్తున్నారు. కనీసం కోర్ట్ కి వెళ్దాం అనుకుంటే అడుగు బయట పెట్టనీయ‌డం లేదని.. అందుకే నేనే స్వయంగా పోలీస్ శాఖ మీద కోర్ట్ లో కేసు వేస్తున్నాన‌ని తెలిపారు. క‌నీసం మా కార్యకర్తలను సైతం పార్టీ కార్యాలయంకి రానివ్వడం లేదు. మీడియాను సైతం అనుమతితో కష్టం మీద ఇస్తున్నారు అని తెలిసింది. బందిపోట్ల రాష్ట్ర సమితి పార్టీ కార్యక్రమానికి వేల మంది కార్యకర్తలు వచ్చారని.. మా పార్టీ కార్యాలయంలోకి మాత్రం ఎందుకు రానివ్వడం లేదు..? అని ప్ర‌శ్నించారు. పోలీస్ శాఖ మొత్తం కేసీఆర్ అధీనంలో ఉంది. పోలీస్ శాఖ కేసీఅర్ గుప్పిట్లో ఉన్నా.. న్యాయం మాత్రం బ్రతికే ఉంది.. అందుకే మా పాదయాత్ర కు అనుమతి వచ్చింది.. కేసీఅర్ కి న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే మా పాదయాత్రను సాగనివ్వాలని అన్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆగిన చోట నుంచే పాదయాత్ర కొనసాగింపు ఉంటుంద‌ని తెలిపారు.


Next Story