ఛాలెంజ్‌కు భయపడేది కాదు.. వైఎస్ఆర్ బిడ్డ : షర్మిల

YS Sharmila Fire On MLA Jaggareddy. ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

By Medi Samrat  Published on  27 Sep 2022 12:35 PM GMT
ఛాలెంజ్‌కు భయపడేది కాదు.. వైఎస్ఆర్ బిడ్డ : షర్మిల

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగ‌ళ‌వారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవ్వాళ నన్ను బెదిరించాడట.. ఇంకో సారి మాట్లాడితే బాగొదట.. నీ ఛాలెంజ్‌కు భయపడేది కాదు.. ఈ వైఎస్ఆర్ బిడ్డ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

జ‌గ్గారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని.. వైఎస్సార్ చనిపోయిన రోజు ఆయ‌న‌ పరామర్శకు వస్తే మేము రాజకీయాలు మాట్లాడామట‌.. మేము బాధ‌పడలేదట.. ఆరోజు మా కుటుంబం లో మేము పడిన బాధ మాకే తెలుసున‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చెట్టంత మనిషిని కోల్పోతే.. మా మీద తలకాయ కోల్పోతే ఎలా ఉంటుందో అలా బాధ‌ప‌డ్డామ‌ని తెలిపారు. అసలు మేము బ్రతుకుతమా.. చస్త‌మా అన్నట్లుగా బాధ‌పడినం.. జగ్గారెడ్డి కి ఏం తెలుసు.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అసలు ఎవరు ఈ జగ్గారెడ్డి.. ఛాలెంజ్ చేయడానికి.. పాలమూరు ఎమ్మెల్యేలు అంతా కలిసి స్పీకర్ కి ఫిర్యాదు చేస్తేనే భయపడలేదని వివ‌రించారు. ఒక మంత్రి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే భయపడలేదని.. ఈ రాజశేఖర్ బిడ్డ.. ఎవడికి భయపడేది కాదని.. ద‌మ్ముంటే నన్ను అరెస్ట్ చేయండని సంకెళ్లు చూపించినట్లు గుర్తుచేశారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం.. పులి బిడ్డ.. ఇక్కడున్నది వైఎస్సార్ ఊపిరి.. వైఎస్సార్ ప్రాణం అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


Next Story
Share it