కిసాన్ ద్రోహి కేసీఆర్ : సీఎంపై షర్మిల విమ‌ర్శ‌లు

YS Sharmila Fire On CM KCR. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  9 Jan 2023 7:15 PM IST
కిసాన్ ద్రోహి కేసీఆర్ : సీఎంపై షర్మిల విమ‌ర్శ‌లు

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కిసాన్ ద్రోహి కేసీఆర్ అంటూ ట్వీట్ లో విరుచుకుపడ్డారు. 'రైతులకు పంట రుణాలు లేవు. ఉచిత ఎరువులు లేవు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు. పంట నష్టపోతే పరిహారం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే సాయం లేదు. కౌలు రైతులకు దిక్కూమొక్కూ లేదు. కేవలం రూ.5 వేల రైతుబంధు ఇచ్చి.. రైతు ప్రభుత్వమని, సిగ్గులేకుండా గొప్పలు చెప్తున్నాడు కిసాన్ ద్రోహి కేసీఆర్' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ కోడలిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతానంటూ షర్మిల తెలంగాణ పాలిటిక్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలో తెలంగాణలో పలు సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


Next Story