వైఎస్ ష‌ర్మిల అరెస్ట్‌

YS Sharmila Arrest. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమ‌ని

By Medi Samrat  Published on  15 Feb 2022 8:48 AM GMT
వైఎస్ ష‌ర్మిల అరెస్ట్‌

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమ‌ని వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైయస్ షర్మిల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న వైయస్ షర్మిల.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అంద‌జేశారు. అనంత‌రం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల ఆందోళ‌న బాటప‌ట్టారు. ఈ నేఫ‌థ్యంలో వైయస్సార్సీపి కార్యకర్తల రాకతో టీఎస్పీఎస్సీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ష‌ర్మిల‌ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తర‌లించారు. ఈ క్ర‌మంలో షర్మిల పోలీస్ స్టేషన్ లోనే నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.Next Story
Share it