వైఎస్ షర్మిల కీలక ప్రకటన..!

YS Sharmila Announces Contest Paleru Constituency. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

By Medi Samrat
Published on : 19 Jun 2022 5:41 PM IST

వైఎస్ షర్మిల కీలక ప్రకటన..!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆమె కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు.

ఇప్పటి నుంచి నా ఊరు పాలేరు.. వైఎస్ఆర్ ఫొటోతో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు. వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదు.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉంది. ఈరోజు నుంచి పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు. నా కోరిక కూడా. వైఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నియోజకవర్గం నుంచే మొదలు కావాలని వైఎస్ షర్మిల అన్నారు.












Next Story