నోట్లో గుడ్డలు కుక్కి 23 ఏళ్ల యువతిని.. పట్టపగలు కారులో కిడ్నాప్‌.. కానీ ట్విస్ట్‌ ఎంటంటే.!

Young woman kidnapped in Dharmapuri. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం నాడు ఓ యువతిని పట్టపగలు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. 23 ఏళ్ల యువతిని పట్ట పగలు దుండగులు

By అంజి  Published on  15 Dec 2021 3:14 AM GMT
నోట్లో గుడ్డలు కుక్కి 23 ఏళ్ల యువతిని.. పట్టపగలు కారులో కిడ్నాప్‌.. కానీ ట్విస్ట్‌ ఎంటంటే.!

జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం నాడు ఓ యువతిని పట్టపగలు కిడ్నాప్‌ చేయడం కలకలం రేపింది. 23 ఏళ్ల యువతిని పట్ట పగలు దుండగులు కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్‌ చేసే ప్రయత్నం చేశారు. నేరుగా యువతి ఇంటికి వచ్చిన దుండుగులు ఆమె నోటిలో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కోటేశ్వర్‌.. చుట్టు పక్కల పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చి వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే కారు మోరాయించడంతో కిడ్నాపర్లు ధర్మపురి పట్టణం దాటి వెళ్లలేకపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన 23 ఏళ్ల యువతి మంగళవారం నాడు ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లారు. ఏపీ24ఏఈ2270 అనే నెంబర్‌ గల కారు మధ్యాహ్నం యువతి ఇంటికి వచ్చింది. కారులో సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన మంగళారపు రాజేందర్‌తో పాటు మరో ముగ్గురు యువతి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఆమె నోట్ల గుడ్డలు కుక్కి.. బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అక్కడి నుండి కొంత దూరం వెళ్లాక ధర్మపురి అంబేద్కర్‌ చౌక్‌ దగ్గర.. వారి కారు మోరాయించింది.

ఈ క్రమంలోనే ఇద్దరు దుండుగులు స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌వైపు కారును తోసుకుంటూ వెళ్లారు. అక్కడ డ్రైవర్‌ కారు దిగి ఇంజిన్‌ చూస్తున్న సమయంలో డోర్‌ లాక్‌ ఓపెన్‌ చేశాడు. దీంతో యువతి దుండగుల నుండి తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలోకి పరుగులు తీసింది. దీంతో దుండుగుల కారును అక్కడే వదిలిసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని, కారును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Next Story
Share it