కారవాన్ లో తెలంగాణను చుట్టేయొచ్చు.. వివరాలివిగో..
You can rent a caravan to explore Telangana. ఈ మధ్య కాలంలో టూరిజం కాస్త తగ్గింది. కరోనా భయాలు ఒకవైపు, ఏఏదైనా హోటల్ కు
By Medi Samrat
ఈ మధ్య కాలంలో టూరిజం కాస్త తగ్గింది. కరోనా భయాలు ఒకవైపు, ఏఏదైనా హోటల్ కు వెళ్లాలంటే కూడా టెన్షన్ తప్పదు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిలో మీరు మరిన్ని ప్రైవేట్ మరియు ప్రత్యేకమైన అనుభవాలను కోరుతూ ఉండవచ్చు. తాజాగా తెలంగాణలో మీరు మీ స్నేహితులు, కుటుంబంతో టూర్ లను వేయడానికి కారవాన్ లు అందుబాటులోకి వచ్చాయి. కేవలం సినిమా షూటింగ్ లకు మాత్రమే కేరవాన్ లను వాడే కాలం పోయింది. ఇప్పుడు హ్యాపీగా కారవాన్ ను బుక్ చేసుకొని మీకు నచ్చిన ప్రాంతాలను చుట్టేయొచ్చు.
సాధ్యమైన అన్ని సౌకర్యాలతో ప్రైవేట్ క్యారవాన్‌ను అద్దెకు తీసుకోవడం, రహదారిపై వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) తక్కువ అద్దెతో కారవాన్ లను అందిస్తోంది. AC కారవాన్ వాహనాలలో ఆధునిక టాయిలెట్, షవర్, రెండు LED స్క్రీన్‌లు, రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్‌తో ఉంటాయి. మీరు మీ సీట్లను సోఫాలు లేదా బెడ్‌లుగా మార్చుకోవచ్చు, ఒక వ్యాన్‌లో ఏడుగురు వ్యక్తులకు వసతి కల్పిస్తుంది.
కారవాన్ ప్యాకేజీ వివరాలు :
8 గంటలు – 80 km – Rs. 4000
12 గంటలు – 200 km – Rs. 6000
అవుట్ స్టేషన్ కిలోమీటర్ కు Rs. 35; మినిమం 300 km
ఒక్కో కిలోమీటర్ కు Rs. 25; ఎక్స్ట్రా గంటకు Rs. 300
20 శాతం ఎక్కువగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది (refundable caution deposit) GST అప్లై అవుతుంది. M.V. Tax అవుట్ స్టేషన్ కు అప్లై అవుతుంది.
టోల్ గేట్లు, పార్కింగ్ ఛార్జీలు మొదలైనవాటిని వినియోగదారుడే భరించాలి. కేవలం కారవాన్ మాత్రమే కాదు, పర్యాటకుల అవసరాలకు మెరుగైన సేవలందించేందుకు, పర్యాటక శాఖ టూరిస్ట్ బస్సుల సమర్ధవంతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం, విలాసవంతమైన బెంజ్, వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన దేశంలోనే మొట్టమొదటి పర్యాటక శాఖలలో తెలంగాణ టూరిజం శాఖ నిలిచింది. ప్రయాణీకులకు వారి బడ్జెట్‌కు సరిపోయేలా వారి పర్యటనలకు వెళ్లేలా అవకాశం ఇచ్చింది. బెంజ్, వోల్వో బస్సులే కాకుండా, పర్యాటకులు తమ గమ్యస్థానాలకు త్వరగా మరియు సురక్షితంగా చేరుకోవడానికి ఇండికా, ఇన్నోవాలు కూడా ఉన్నాయి.
మరింత సమాచారం కోసం సంప్రదించండి : వెబ్సైట్: https://tourism.telangana.gov.in/package/VehicleHire.